స్లీవ గురుతు
పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్. ♰
పరలోక జపము
పరలోకమందు౦డెడు మా యొక్క తండ్రీ! మీ నామము పూజి౦పబడునుగాక!
మీ రాజ్యము వచ్చునుగాక!
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుబడినవారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్ని౦చండి .
మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.
మంగళ వార్త జపము
దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును, మా మరణ సమయమందును
ప్రార్ధించండి. ఆమెన్.
త్రిత్వ స్తోత్రము
పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక.
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదా కాలము కలుగును గాక. ఆమెన్.
విశ్వాస సంగ్రహము
పరలోకమును,
భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేస్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాధుడైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పో౦స్త్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి,
స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉ౦చబడెను.
పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారాలలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చండి యున్నాడు.
అక్కడ నుండి జీవించు వారలకును,
చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కతోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరము యొక్క ఉత్ధానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.
ఉత్తమ మనస్తాప జపము
సర్వేశ్వర స్వామీ! దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన, సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించు చున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన, మహా మనస్తాప పడుచున్నాను స్వామి, మహా దు:ఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాప పడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమెన్.
విశ్వాస జపము
సర్వేశ్వర స్వామీ! సత్యస్వరూపులై యుండెడు దేవర వారు తెలియపరచి తిరుసభ ద్వారా రోధించు సత్యములన్నిటిని విశ్వసించుచున్నాను.
The daily prayers on this website have helped me find peace and strength in my daily life.
Grace Smith
I am grateful for the mass readings and prayers provided on this website. It has truly enriched my spiritual journey.
John Doe
★★★★★
★★★★★
Daily Prayers
Explore a collection of Telugu Catholic prayers for daily inspiration.